హంతకులెవరో చెప్తే 10 లక్షల బహుమతి - MicTv.in - Telugu News
mictv telugu

హంతకులెవరో చెప్తే 10 లక్షల బహుమతి

September 8, 2017

గౌరీ లంకేష్ హత్య కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి 10లక్షల నగదు బహుమతి ప్రకటించిన కర్ణాటక హోం మినిస్టర్. ఆమెను పక్కా పథకం ప్రకారమే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎస్ఐటీ ప్రాథమిక విచారణలో కూడా ఇది తేటతెల్లమైంది. హత్యకు నెల రోజుల ముందు నుండే హంతకులు తన ప్రతీ కదలిక మీద నిఘా పెట్టినట్టు గౌరీ వాళ్ళమ్మకు వివరించిందట. హోంమినిస్టర్ ను కలిసి ఈ విషయం చెబుదామని కూడా అనుకుందట. కానీ కుదరలేదట. అయితే ఇప్పుడు తాజాగా ఆ హంతకులను ఎలాగైనా పట్టుకోవాలని కర్ణాటక హోం శాఖ ఈ నజరానాను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.