సైదాబాద్ కేసు.. రాజుపై రూ. 10 లక్షల రివార్డు - MicTv.in - Telugu News
mictv telugu

సైదాబాద్ కేసు.. రాజుపై రూ. 10 లక్షల రివార్డు

September 14, 2021

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి బలితీసుకున్న పల్లంకొండ రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రాజు ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడం, మరోపక్క తీవ్ర నిరసనలు పెల్లుబుకుతుండడంతో రివార్డు ప్రకటించారు.

రాజు వయసు 30 ఏళ్లని, చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన అతడు తాగి రోడ్లపై పడిపోతుంటాడని తెలిపారు. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన రాజు గత గురువారం ఓ చిన్నారికి చాక్లెట్ ఆశచూపి దురాగతానికి తెగబడ్డాడు. మృతదేహాన్ని తన గదిలోనే ఉంచి పరారయ్యాడు. అతడు పారివడానికి స్థానిక వ్యక్తి ఒకరు సాయం చేసినట్లు సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. అతణ్ని అరెస్ట్ చేశారని వార్తలు రావడం, అవి నిజం కాదని గందరగోళం నెలకొంది. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు.