వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసులో చోరీ.. రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు..! - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసులో చోరీ.. రూ.10 లక్షలు ఎత్తుకెళ్లారు..!

November 19, 2019

Alla Ramakrishna Reddy.

చోరీగాళ్లు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. అక్కడా ఇక్కడా చేస్తే ఏం అనుకున్నారో ఏమో ఏకంగా ఎమ్మెల్యే ఆఫీసుకే కన్నం వేశారు..మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఇది జరిగింది. ఎవరూ లేని సమయంలో గుట్టు చప్పుడు కాకుండా రూ. 10 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పలు సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే తన కార్యాలయంలో రూ. 10 లక్షలు  దాచి ఉంచారు. తీరా అవి కనిపించకుండా పోయాయి. అయితే తెలిసిన వారు లేదా ఆఫీసులో ఉన్నవారే తీసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.