తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు..

May 8, 2020

10 new coronavirus cases in telangana today

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 1132కి చేరింది. ప్రస్తుతం 400 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. 

ఈరోజు 27 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 720 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాలో కేసులు లేవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రం రెడ్ జోన్ లో ఉన్నాయి . వీటిల్లో కూడా రూరల్ ప్రాంతంలో కేసులు లేవు. దేశంలో కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 56,516 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 16867 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 1895 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.