10 Sri Lankan athletes missing in Britain
mictv telugu

బ్రిటన్‌లో 10 మంది శ్రీలంక అథ్లెట్ల మిస్సింగ్.. కారణం ఇదే కావొచ్చు

August 9, 2022

బ్రిటన్‌లోని బర్మింగ్ హామ్‌లో నిర్వహించిన కామన్ వెల్త్ దేశాల క్రీడా పోటీలు సోమవారంతో ముగిశాయి. ఇందులో పాల్గొనడానికి బ్రిటన్ వచ్చిన శ్రీలంక బృందంలోని నలుగురు అథ్లెట్లు, ఆరుగురు అధికారులు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. వారందరూ తమ లగేజీని క్రీడా గ్రామంలోనే వదిలేసి వెళ్లిపోయారు. వారికి ఇచ్చిన వీసా గడువు మరో ఆరు నెలల పాటు వ్యాలిడిటీ ఉండడంతో అక్కడే కొన్ని నెలల పాటు ఉండేందుకు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. స్వదేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, ఆహారం కొరత, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోనే ఉపాధి వెతుక్కుని ఉండిపోవాలన్న భావనతో మిస్సయినట్టు తెలుస్తోంది. అయితే ఈ మిస్సింగ్ వ్యవహారం అక్కడి పోలీసులకు తెలపడంతో వారు గాలించి ముగ్గురు అథ్లెట్లను పట్టుకున్నారు. మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.