మాల్స్, సినిమా థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ దొరికే చిరుతిళ్లలో జరిగే మోసం అంతా ఇంతా కాదు. ఇచ్చేది తక్కువ.. తీసుకునే ధర ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు అధికారులు తనిఖీలు చేసినా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడంలేదు. అలాగే జనగామలోని ఓ థియేటర్లో తనిఖీలు చేసిన తునికలు,కొలతలశాఖ అధికారులు ఓ క్యాంటీన్ యజమాని చేస్తున్న మోసం గుర్తించారు. నిబంధనలకు అతిక్రమించి పాప్‌కార్న్ 15 గ్రాములు తక్కువ చేసి అమ్ముతుండగా గుర్తించి రూ.10 వేల జరిమానా విధించారు.
స్వర్ణ కళామందిర్ సినిమా థియేటర్లోని క్యాంటీన్లో అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ 60 గ్రాముల పాప్‌కార్న్‌ను రూ.40కు అమ్ముతున్నారు. అయితే దాన్ని తూకం వేయగా అందులో 15 గ్రాములు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తూ నిబంధనలు అతిక్రమించినందుకు క్యాంటీన్ యజమానికి రూ. 10 జరిమానా విధించారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేక్షకులు కూడా ఇటువంటి మోసాలు గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.