కాలుష్య ఉల్లంఘనుల సమాచారమిస్తే.. రూ. 10వేల బహుమతి.. - MicTv.in - Telugu News
mictv telugu

కాలుష్య ఉల్లంఘనుల సమాచారమిస్తే.. రూ. 10వేల బహుమతి..

May 17, 2019

కాలష్యంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరు అవుతున్నారు. ఇంట్లోంచి బయటికొస్తే చాలు ఏం జరుగుతుందోనని భయంతో వనికిపోతున్నారు. ఇప్పటికే అనేక మంది కాలుష్య కారణంగా శ్వాసకోస వ్యాధులతో బాధపుడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మనుషుల ప్రాణాలకే ప్రమాదమని భావించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి.. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది.

10 thousand Rupees Giving For Pollution Violations Information In Hyderabad.. Telangana Pollution Control Board

హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు జల, వాయు, శబ్ద కాలుష్యాలతో పాటు ఘన, రసాయన వ్యర్థ జలాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, జలాలను కాలుష్యం చేస్తున్నాయి. రసాయన వ్యర్థాల అక్రమ డంపింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు కాలుష్య నియంత్రణ మండల కొద్ద పద్దతికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం నజరానను కూడా ప్రకటించింది.

కాలుష్య ఉల్లంఘనుల గురించి సమాచార ఇచ్చినవారికి రూ. 10 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది. గతంలో ఈ నజరానా రూ.3వేలు ఉండగా… ఇప్పుడు దాన్ని రూ.10 వేలకు పెంచారు. ఫిర్యాదు చేసేందుకు మొబైల్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీలు కూడా ప్రకటించింది.

సరైన నిఘా లేకపోవడంతో గ్రేటర్‌లోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. అందుకే పొల్యూషన్ కంట్రోల్ బోర్ట్ (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. PCBకి  సమారమిచ్చిన వారికి రూ. 10 వేల ప్రొత్సాహాకాన్ని ఇస్తామని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలంగాణ PCB సభ్యకార్యదర్శి తెలిపారు.

సమాచారమివ్వాల్సిన అధికారులు నంబర్లు ఈ మెయిల్ ఐడీ..

సభ్యకార్యదర్శి వి. అనిల్‌కుమార్ : 90005 51355

చీఫ్ ఇంజినీర్ విశ్వనాథం : 99490 78336

రమేష్‌గుప్తా : 91773 03206

మేయిల్‌ఐడీ:ms-tspcb<\@>telangana.gov.in