చిన్నారి జాలిగుండె..కేన్సర్ రోగుల కోసం - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారి జాలిగుండె..కేన్సర్ రోగుల కోసం

September 21, 2020

mvm

అమ్మాయిలకు జుట్టే అందం అంటారు. ఆ జుట్టును అందంగా తయారు చేసుకోవడం కోసం ఎన్నో రకాల నూనెలు, షాంపూలు, వాడుతుంటారు. దువ్వుతున్నప్పుడు కొంచెం జుట్టు ఊడినా బాధపడిపోతుంటారు. అటువంటిది ఎంతో అపురూపంగా చూసుకున్న తన జుట్టుని క్యాన్సర్‌ రోగుల కోసం దానం చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తోంది సూరత్‌కు చెందిన దేవ్నా జనార్దన్‌ అనే పదేళ్ల చిన్నారి. 

ప్రస్తుతం దేవ్నా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో క్యాన్సర్‌ రోగుల కోసం తన జుట్టును దానం చేసింది. ‘నా జుట్టు వేరే వాళ్లకు ఉపయోగపడడం సంతోషంగా ఉంది. అందుకే ఎంత అపురూపంగా పెంచుకున్న జుట్టుని దానం చేస్తున్న.’ అని దేవ్నా తెలిపింది. తన 32 అంగుళాల పొడవాటి జుట్టును దానం చేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. దేవ్నా జుట్టు ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చిన్న వయసులో దేవ్నా చూపిన ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.