ఏం కిక్ ఇచ్చాడు.. బుడ్డోడు వేసిన గోల్‌కు ఫిదా అవ్వాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

ఏం కిక్ ఇచ్చాడు.. బుడ్డోడు వేసిన గోల్‌కు ఫిదా అవ్వాల్సిందే

February 15, 2020

10 Year Old Kerala Kid Football Kick

ఒక్క కిక్‌తో ఫుట్‌బాల్ నెట్‌లో పడి గోల్ సాధించడం ఇది సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇటువంటి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలోనూ ఇలాంటి అరుదైనా గోల్‌ను ఓ పదేళ్ల బుడ్డోడు చేశాడు.గోల్ కీపర్‌ని దాటి బాల్ నేరుగా నెట్‌లోకి వెళ్లింది. కేవలం ఒకే ఒక్క కిక్‌తో గోల్ రావడంతో చూసిన వారంతా కొంత సేపు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో  ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈనెల 9న కేరళలో జరిగిన జరిగిన ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కిడ్స్ ఫుట్ బాల్ పోటీల్లో భాగంగా దనిశ్ అనే 10 ఏళ్ల బాలుడు ఈ ఫీట్ ను సాధించాడు. గోల్ కీపర్‌కు ముందు నిలబడి బంతిని గాల్లోనే వంకరగా ఎగిరేలా చేసి ఎవరికీ అందకుండా నేరుగా నెట్‌లెకి వెళ్లేలా చేశాడు. సెకండ్ కంటే తక్కువ సమయంలో జీరో డిగ్రీ డైమెన్షన్ నుంచి నేరుగా నెట్‌లో పడిపోయింది. ఇది ఓ అరుదైన ఘటనగా ఫుట్ బాల్ అభిమానులు చెబుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఇండియా ఫ్యూచర్ ఛాంపియన్స్ అని మెచ్చుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆ  చిన్నారి ఉన్న టీమ్ హ్యాట్రిక్ స్కోర్ సాధించడం మరో విశేషం.