డాక్టర్లపై దాడి చేస్తే పదేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా! - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్లపై దాడి చేస్తే పదేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా!

November 17, 2019

డాక్టర్లపై రోగుల బంధువులు చెయ్యి చేసుకుంటున్న సంఘటనలు పెరుగుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ వాళ్లు చనిపోయారన్న విషాదంలో దాడులు చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కూడా పెరుగుతోంది. ఎవరి తప్పు? ఎవరిది ఒప్పు అన్నది అప్పటికప్పుడు తేల్చాల్సిన విషయం కాదు. మొత్తానికి డాక్టర్లకు రక్షణకు కల్పించేందకు ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొస్తోంది. వారిపై దాడి చేస్తే రూ. 10 లక్షల జరిమానాతోపాటు, పదేళ్ల జైలు పడేలా బిల్లు తీసుకొస్తోంది. 

10 years.

బిల్లు చట్టరూపం దాలిస్తే.. డాక్టర్లపైనే కాకుండా, ఇతర వైద్యసిబ్బందిపై దాడులు చేసినా ఈ శిక్షలు పడతాయి. సంబంధిత బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. డాక్టర్లను, సిబ్బందిని తీవ్రంగా కొడితే కనిష్టంగా 3 ఏళ్ల నుంచి, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూ.2లక్షల నుంచి రూ.10లక్షల జరిమానా కూడా పడుతుంది. ఆస్పత్రులను ధ్వంసం చేసినా శిక్షలు విధించాలి బిల్లులో ప్రతిపాదించారు. అలాంటి నేరాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు, రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా పడుతుంది. 

ిి