ఒకేచోట వంద ఏనుగులు.. తొలిసారిగా! - MicTv.in - Telugu News
mictv telugu

ఒకేచోట వంద ఏనుగులు.. తొలిసారిగా!

December 9, 2017

అతనికి వెయ్యేనుగుల బలం’ అని అతిశయోక్తితో అంటుంటారు. వెయ్యికాదు గాని వంద ఏనుగుల వీడియో ఇది. వంద ఏనుగులు మనుషులకు ఒకేచోట కనిపించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన సంఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లా నీలగిరి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.


వందకుపై ఏనుగులు జార్ఖండ్‌లోని దాల్మా అభయారణ్యం నుంచి ఒడిశాకు వచ్చాయి. ఇందులో కొన్ని గున్నఏనుగులు కూడా ఉన్నాయి. అవి తమకు కనిపించిన మనుషులను ఏమీ అనుకుండా వాటి దారిన అవి వెళ్లిపోయాయి. పంటపొలాలను కూడా నాశనం చేయకుండా బుద్ధిగా అడవుల్లోకి వెళ్లిపోయాయి.

ఈ అటవీ ప్రాంతంలో ఇంతపెద్ద సంఖ్యలో ఎనుగులు ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు చెప్పారు. అవి వెళ్తున్న దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.