100 అడుగులు నడిచి కరోనా ఉందో, లేదో కనుక్కోవచ్చు! - MicTv.in - Telugu News
mictv telugu

100 అడుగులు నడిచి కరోనా ఉందో, లేదో కనుక్కోవచ్చు!

June 30, 2020

100 Feet walk test to detect corona covid 

కరోనా పరీక్షలు మొదట్లో చాలా సుదీర్ఘంగా సాగేవి. గళ్ల నమూనా తీసుకున్న తర్వాత ఫలితాల కోసం మూడు నాలుగు రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. యూరప్, అమెరికా శాస్త్రవేత్తలు అత్యాధునిక మెడకల్ టెన్నాలజీతో ఆ గడువును బాగా తగ్గించారు. ఐదు నిమిషాల్లోనే ఫలితాన్ని ప్రకటించే టెక్నాలజీ మన దేశంలోనూ అందుబాటులో ఉంది. అయితే కరోనా పరీక్షలు ఖరీదైనవి కావడంతో అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగడంలేదు. కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు అక్కర్లేదని ప్రభుత్వాలు చెబుతున్నా ప్రజలు మాత్రం భయపడుతూనే ఉన్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలో లేకపోయినా కరోనా సోకడమే దీనికి కారణం. 

దీంతో కరోనా పరీక్షలకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లోనే ఉండి తెలసుకునే డివైజులపై ఆసక్తి చూపుతున్నారు. బెలూన్ ఉంది శ్వాస సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని, తేడాలు వస్తే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. తాజాగా వంద అడుగులు పరీక్ష కూడా ఈ కోవలో చేరింది. ఏపీకి చెందిన కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి ఈ పరీక్షను సూచిస్తున్నారు. ‘100 అడుగులు నడవాలి. ఆ సమయంలో మీకు ఆయాసంగా అనిపిస్తే కరోనా ముప్పు ఉన్నట్టే. విజయవాడలో 100 మందిని  ఇలా నడిపించి చూడగా 58 మందికి ఆయాసం వచ్చిది. వారికి కరోనా పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్ తేలింది..’ అని ఆయన వివరించారు. కరోనా రోగనిరోధక శక్తిని దారుణంగా దెబ్బతీస్తుంది కనుక ఆ ప్రభావం నడకతోపాటు, శ్వాస, ఇతర అవయవాల పనితీరుపై కనిపిస్తుంది.