రూ. 100 నోట్లు చెల్లవట! RBI ఏం చెబుతోంది?  - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 100 నోట్లు చెల్లవట! RBI ఏం చెబుతోంది? 

January 25, 2021

100 notes demonetization alleged news

నోట్ల రద్దు కష్టాల నుంచి ప్రజలింకా కోలుకోలేదు. క్యూలైన్లలో నిలబడి వేలమంది చనిపోవడం, చిల్లర దొరక్క అల్లాడిపోవడం ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరో కలకలం రేగింది. వంద రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 5 రూపాయలు, 5 రూపాయల నాణేలు ఇకపై చెల్లవని ప్రచారం సాగుతోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో 10 రూపాయల నాణేలను వ్యాపారులు ఇప్పటికే తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో 10, 5 నాణేలతోపాటు 100 రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

ఈ ఏడాది మార్చి నుంచి ఇవి చెల్లుబాటు కావని ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదని, 1000, 500 నోట్లను రద్దు చేసినట్లే 100 నోట్లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టి పడేసింది. వాటిని రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని, ప్రజలు అలాంటి పుకార్లను నమ్మద్దొని సూచించింది. 

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులోలో రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త 500 నోట్లను, 2 వేల నోట్లను తీసుకొచ్చింది. కొత్త 20, 50, 100, 200 నోట్లు కూడా చలామణలోకి వచ్చాయి. అయితే వీటిని వృద్ధులు గుర్తించలేకపోతున్నారని, పాత వంద నోటుకంటే చిన్నగా ఉండడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త 100 నోట్లను రద్దు చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.