ఒక్కోరు ఒక్కో తీర్న నడుస్తరు. వయస్సును బట్టి కూడా నడక ఉంటది. కానీ ఇవన్నీ
కలిపి ఒక్కరే నడిస్తే ఎట్లా ఉంటుంది. ఇగో అదే చేసి చూపించాడు.
స్టాప్ మోషన్ యానిమేటర్ కెవిన్ బిప్యారీ. థ్రెడ్ మిల్ పై ఆయన వివిధ రకాలుగా నడిచి
చూపించాడు. నడక అంటే మాములుగా కాదు… కొందరు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు భయం
భయంతో నడుస్తారు. కొందరేమీ పట్టించుకోరు. అట్లనే చీకట్లో ఉన్నప్పుడు,
ఆత్మవిశ్వాసం బాగా ఉన్నప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు, దాక్కుని
వెళ్లేటప్పుడు, ముసలితనంలో ఇట్లా ఆయా సందర్భాల్లో ఎట్లా నడుస్తారో
థ్రెడ్ మిల్ పై నడిచి మరీ చూపించాడు స్టాప్ మోషన్ యానిమేటర్.