వందేళ్ళ బామ్మను రేప్ చేసి చంపేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

వందేళ్ళ బామ్మను రేప్ చేసి చంపేశాడు

October 31, 2017

దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్‌ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన వృద్ధురాలు, వయసు మీద పడడంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది.

ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్‌ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని స్థితిలో, ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపులు వినబడటంతో చుట్టుపక్కలవారు స్పందించారు.

ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరవగా, యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుడు చేసిన అకృత్యానికి పాపం, ఆ బామ్మ ప్రాణాలు కోల్పోయింది.