104 ఏళ్ల భర్త మృతి.. గంటలోపే 100 ఏళ్ల భార్య కూడా..  - MicTv.in - Telugu News
mictv telugu

104 ఏళ్ల భర్త మృతి.. గంటలోపే 100 ఏళ్ల భార్య కూడా.. 

November 13, 2019

ఆయనకు 104 ఏళ్లు. ఆమెకు 100 ఏళ్లు.. జీవితాంతం ఒకరికి ఒకరుగా తోడు నీడగా ఉన్నారు. పెళ్లినాటి ప్రమాణాలను పాటించి చూపారు. 80 ఏళ్లు ప్రాణంలో ప్రాణంగా జీవించారు. చూసినవారంతా వారిని ఆది దంపతులు అనేవారు. వారి ఆశీర్వాదాలు తీసుకునేవారు. అంతా సవ్యంగా ఉన్న సమయంలో భర్త హృదయ సంబంధిత వ్యాధితో మృతిచెందాడు. అన్ని దశాబ్దాల పాటు కలిసి జీవించిన సహచరుడు మృతి భార్య మనస్సుని తీవ్రంగా కలిచివేసింది. నీవు లేని ఈ జీవితం నాకెందుకు అనుకుందేమో కన్నీటితో రోదిస్తూ భర్త భౌతికకాయంపై పడి తుది శ్వాస విడిచింది. 

tamil nadu.

ఈ విషాదకర సంఘటన తమినాడులోని పుదుక్కొట్టై జిల్లాలో సోమవారం జరిగింది. కుప్పకూడి ఆది ద్రావిడార్ కాలనీకి చెందిన వట్రివేల్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని వయస్సు 104. అతని భార్య పిచాయి వయస్సు 100. వారిద్దరికీ వివాహం జరిగి దాదాపు 80 ఏళ్లు అయ్యింది. అంతా సవ్యంగా ఉండగా సోమవారం రాత్రి వెట్రివేల్ తనకు ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు అతడిని వెంటనే అలాంగుడిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అతడికి వ్యాద్యం చేసిన డాక్టర్లు వెట్రివేల్ మరణించాడని తెలిపారు. వెట్రివేల్ మృతదేహాన్ని చుసిన పిచ్చాయి భర్త మృతిని తట్టుకోలేక గంట వ్యవధిలోనే తుదిశ్వాస విడిచింది. వారికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 23 మనుమలు.. మనుమరాళ్లు ఉన్నారు. అంతా ఉమ్మడి కుటుంబంగానే జీవిస్తున్నారు. ఆనందాలు వెల్లివిరిసే వారి జీవితాల్లో సోమవారం రాత్రి విషాదం నింపింది.