స్టేటస్ రేపిన దుమారం.. పోలీస్ స్టేషన్‌పై వేయి మంది దాడి - MicTv.in - Telugu News
mictv telugu

స్టేటస్ రేపిన దుమారం.. పోలీస్ స్టేషన్‌పై వేయి మంది దాడి

April 18, 2022

police

ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్న ఓ వీడియో కర్ణాటకలో హింసకు దారి తీసింది. వేయి మంది పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. శనివారం రాత్రి హుబ్బళ్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రార్ధనా మందిరంపై కాషాయ జెండా ఎగురుతున్నట్టు ఎడిట్ చేసిన వీడియోను ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌పెట్టుకున్నాడు. క్రమంగా ఆ వీడియో వైరల్‌గా మారి మరో వర్గం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. దాంతో ఆ యువకుడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అది చాలక యువకుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌పై పెద్ద ఎత్తున దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈక్రమంలో పక్కనే ఉన్న ఓ ఆలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇన్‌స్పెక్టర్ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే సాయుధ బలగాలను రప్పించి, పట్టణంలో 144 సెక్షన్ విధించారు. వీడియో పెట్టిన యువకుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ లాభురామ్ వెల్లడించారు. మతపెద్దలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. అంతేకాక, సీసీ కెమెరాల ఆధారంగా పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగిన వారిలో 45 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.