మళ్లీ రూ. 1,000 నోటు రాక! - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ రూ. 1,000 నోటు రాక!

August 28, 2017

కేంద్రంలోని మోదీ సర్కారు నోట్లు మార్చడమే పనిగా పెట్టుకున్నట్టుంది. ఈ వార్త వింటే ఇది నిజమనిపిస్తుంది మీకూ. గత ఏడాది నవంబర్ 8న రద్దు రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేయడం తెలిసిందే. అయితే సర్కారుకు ఏమైందో ఏమోగాని రూ. 1000 నోటును మళ్లీ అచ్చొత్తి చలామణిలోకి తీసుకురానుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 1000ను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టనుందని సమాచారం. ఏ ఏడాది డిసెంబర్ నాటికి ఈ నోట్లు మార్కెట్లోకి వస్తాయని నోట్ల వ్యవహారం గురించి తెలిసిన అధికారి ఒకరు చెప్పారు. మైసూర్, సల్బోణిలోని టంకశాలలు ఈ నోట్లను అచ్చు గుద్దడానికి సిద్ధం అవుతున్నాయట.

ప్రస్తుతం రూ. 500, రూ. 2000 నోట్ల మధ్య మరో నోటు లేకపోవడంతో చిల్లర సమస్య తలెత్తుతోందని, దీని పరిష్కారం కోసం రూ. 1000 నోటును తీసుకొస్తున్నారని బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. రూ. 2000 నోట్లు ఇకపైనా కొనసాగుతాయననారు. రిజర్వు బ్యాంకు ఇటీవల కొత్త రూ. 500, రూ. 50 నోట్లను ప్రవేశపెట్టడం తెలిసిందే.