సర్కారు బడిలో చదివితే నెలకు రూ.1000: స్టాలిన్ - MicTv.in - Telugu News
mictv telugu

సర్కారు బడిలో చదివితే నెలకు రూ.1000: స్టాలిన్

March 19, 2022

19

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు నెలకు రూ. 1000 ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాలికలకు మేలు జరగనుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం బాలికల తల్లిదండ్రులు సీఎం స్టాలిన్‌‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ మాట్లాడుతూ..”ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ప్రతి నెలా రూ. 1000 అందిస్తాం. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 6 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 698 కోట్లను కేటాయించాం. మూవలూరు రామామృతం అమ్మాయార్‌ ఉన్న విద్యా భరోసా పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే 6 నుంచి 12వ తరగతుల బాలికలందరికీ.. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసేంత వరకు ఈ మొత్తాన్ని అందింస్తాం” అని ఆయన అన్నారు.

మరోవైపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కాలర్‌‌షిప్‌లతో పాటు, ఈ పథకం కూడా వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పాఠశాల విద్యకు భారీగా కేటాయింపులు చేసింది. రూ. 36,895.89 కోట్లను కేటాయించడం విశేషం. గతేడాది ఈ మొత్తం రూ. 34,181 కోట్లుగా ఉంది.