100సీసీ బైకుపై ఇక ఒక్కరే  - MicTv.in - Telugu News
mictv telugu

100సీసీ బైకుపై ఇక ఒక్కరే 

October 23, 2017

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. 100సీసీ ఇంజన్, అంతకంటే తక్కువ సీసీ సామర్థ్యం  కలిగిన మోటార్ సైకిళ్లపై ఇప్పటినుంచి ఒక్కరే వెళ్లాలి, వెనుక సీటు ఖాళీగా ఉండాలి, అలాకాదని వెనక ఎవరన్నా ఉన్నారంటే మీ జేబుకు గండి పడ్డట్టే. ముందుగా బెంగుళూరు సిటీలో ఈ నిబంధనను అమలు చేస్తారు. ఆతర్వాత రాష్ట్రం మొత్తం అమలులోకి రానుంది.

ఈ క్రమంలో ఎవరైనా నిబంధనలు తప్పితే, జరిమానాలు, శిక్షలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న మోటార్ సైకిళ్ల రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్ల దురవస్థ. ఈనిబంధన అమలైతే రాష్ట్రంలో బైకుల్లో దాదాపు 25 శాతం ద్విచక్రవాహనాలు, స్కూటీల్లో ఒక్కరే ప్రయాణించాల్సిందే. అయితే 100CC  సీసీ విషయంలో కొంత వెలుసుబాటు కల్పించి, ఆ సామర్థ్యాన్ని 50 CCకు తగ్గించే ఆలోచనలో అధికారుల ఉన్నారు.