1018 కి.మీ. రిక్షా తొక్కుకుంటూ..  - MicTv.in - Telugu News
mictv telugu

1018 కి.మీ. రిక్షా తొక్కుకుంటూ.. 

March 26, 2020

1018 Km.. Rickshaw riding ..

దేశంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు కొత్త కొత్త సమస్యలతో సతమతం అవుతున్నారు. బతుకుదెరువు కోసం వందల కిలీమీటర్ల దూరంలో వేరే ఊళ్లకు, పట్టణాలకు వలస వెళ్లిన వేలాది మంది కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అన్నీ మూత పడటంతో వారికి పని దొరకడంలేదు. దీంతో వారంతా ఇంటికి తిరుగుముఖం పట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు కాలినడకన, కొందరు సైకిల్‌పై, మరికొందరు రిక్షాలో తమ ఊళ్లకు తరలి వెళ్తున్నారు. హరేంద్ర మహ అనే కూలీ రిక్షా తొక్కుతూ ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతీహరికి వెళ్లారు. 

రిక్షాలో ఐదుగురు కుటుంబ సభ్యులను తీసుకుని రిక్షా తొక్కారు. ఢిల్లీ నుంచి అతని ఇంటికి 1018 కిలోమీటర్ల దూరం. ఇందుకోసం ఏడు రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదిలావుండగా మరో 14 మంది కార్మికులు సైకిల్‌ రిక్షాలో యుపీలోని బల్రాంపూర్‌కు బయలుదేరారు. వారిలో ఒకరు దివ్యాంగుడు. కాగా, తెలంగాణలోని ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఏపీ నుంచి వచ్చిన కార్మికులను వారి ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2 వేల మంది కార్మికులు సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్నారు. కారులో డ్రైవర్‌ సహా నలుగురే ఉండాలనే నిబంధనతో వారిని సొంత ఊళ్లకు పంపుతున్నారు.