102 ఏళ్ళ రేసుగుర్రం ఈ బామ్మ... - MicTv.in - Telugu News
mictv telugu

102 ఏళ్ళ రేసుగుర్రం ఈ బామ్మ…

September 25, 2018

వృద్దులకు వయస్సు మీద పడగానే ఒళ్లు నొప్పులు, ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. సరిగ్గా నడవలేని పరిస్థితి, ఇంకా పరుగులు ఎక్కడ పెడతారు ? కానీ ఓ బామ్మ  మాత్రం జింకపిల్లలా పరుగులు లంఖిస్తోంది. పరుగుపందాలలో పరుగెట్టి బంగారు పతకాలు సాధిస్తోంది. ఈ వయసులో ఆమె పరుగుల హుషారుతనాన్ని చూసి జనాలందరూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. ఆ బామ్మను ముద్దుగా ‘మిరాకిల్ ఫ్రమ్ చండిఘర్’అని ముద్దుగా పిలుస్తున్నారు అభిమానులు.  102 Not Out! 'Miracle' centenarian woman Man Kaur eyes more athletics medalsవివరాల్లోకి వెళ్తే… చండీఘర్‌కు చెందిన మన్‌కౌర్ (102) అనే బామ్మ రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, వాకింగ్  పోటీల్లో అనేక పతకాలు సాధించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. చిన్న చిన్న పోటీల్లో ఆమె పతకాలు సాధించలేదు. పెద్ద పెద్ద పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి అందరిచేత ఔరా అనిపించుకుంటోంది. ఆమె 2011 నుంచి క్రీడలపై దృష్టి పెట్టి, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగులో పతకాలు సాధించింది. అలాగే న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో 1నిమిషం 4 సెకన్లలో సాధించింది.  అంతర్జాతీయ స్థాయిలో 20 పతకాలు సాధించింది. ఆమె కొడుకు కోరిక మేరకు 93ఏళ్లు ఉన్నప్పటి నుంచి వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో అడుగుపెట్టి రికార్డులు కొల్లగొడుతోంది.

తాజాగా స్పెయిన్‌లో జరిగిన పోటీల్లోనూ పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. బామ్మ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. జిమ్‌కు వెళుతోంది. ఆమె కుమారుడు గురుదేవ్‌ (78) కూడా అథ్లెటే. అతడి ప్రోత్సాహంతోనే పతకాలు సాంధించింది. ఇప్పుడు 2020లో జపాన్‌లో జరిగే మాస్టర్స్‌ గేమ్స్‌లో మరిన్ని బంగారు పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.