102-year-old Haryana man dead in govt records shows up in chariot to prove he's alive, demand pension
mictv telugu

పెన్షన్ కోసం పెళ్లికొడుకులా ఊరేగింపుతో వెళ్లిన 102ఏళ్ల వృద్ధుడు

September 9, 2022

ప్ర‌భుత్వ రికార్డుల్లో కొన్ని సార్లు త‌ప్పులు దొర్లుతుంటాయన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా చనిపోయిన వారికి పెన్షన్లు మంజూరు చేయడం, బ‌తికి ఉన్న వారిని చంపేయ‌డం లాంటివ‌న్ని ప్ర‌భుత్వ రికార్డుల్లోనే జ‌రుగుతుంటాయి. ఇక్క‌డ కూడా స‌రిగ్గా అలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఓ వృద్ధుడు చ‌నిపోయాడంటూ.. ప్ర‌భుత్వాధికారులు న‌మోదు చేసుకున్నారు. దీంతో అత‌నికి రావాల్సిన పెన్ష‌న్ ఆగిపోయింది. పెన్ష‌న్ రావ‌డం లేద‌ని ఆరా తీస్తే అస‌లు విష‌యం బయటపడింది.

దీంతో త‌ను బ‌తికే ఉన్న విష‌యాన్ని ఎలాగైనా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాల‌నుకున్నాడు ఆ వృద్ధుడు. మీ రికార్డులు తప్పు.. నేను బతికే ఉన్నా.. దయచేసి పెన్షన్ ఇవ్వండి’ అంటూ వినూత్న నిరసన ప్రదర్శన చేశాడు. హరియాణా రోహ్తక్ జిల్లా గంద్రా గ్రామానికి చెందిన దులీ చంద్కు మార్చి నుంచి వృద్ధాప్య పింఛను ఆగిపోయింది.. అతడు చనిపోయాడని రికార్డుల్లో నమోదైంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని.. తన కుటుంబ సభ్యుల సాయంతో వరుడిలా ముస్తాబై, గుర్రపు బండి ఎక్కి.. మేళతాళాలు, యువకుల నృత్యాల మధ్య గురువారం రోహ్తక్లో బరాత్ నిర్వహించాడు. ఇప్పటికైనా తాను బతికే ఉన్నట్లు నమ్మి, పెన్షన్ వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని కోరాడు. మాజీ మంత్రి, బీజేపీ నేత మనీశ్ గ్రోవర్ను కలిసి ఇదే విషయంపై వినతి పత్రం అందజేశాడు.