Home > Featured > గట్టి పిండమే.. కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ

గట్టి పిండమే.. కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ

bama

అమెరికాలోని న్యూయార్క్ సిటీని కరోనా వణికిస్తోంది. వైరస్ బారినపడిన వాళ్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా వయసు పై బడిన వారు వైరస్ సోకితే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇంతటి విపత్కర సమయంలోనూ ఓ 102 ఏళ్ల బామ్మ వైరస్‌ను జయించారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి చేరారు. ఈ వయసులో మహమ్మారితో పోరాడటం గొప్ప విషయమని వైద్యులు చెబుతున్నారు.

గ్రీస్‌కు చెందిన సోఫీ అవోరిస్ అనే బామ్మ న్యూయార్క్‌లోని మన్ హాట్టన్‌లో నివసిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఆమెకు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి అనారోగ్యంగా ఉండటంతో పరీక్షల్లో కరోనా అని తేలింది. వెంటనే వైద్యులు ఆమెను ప్రత్యేక వార్డుకు తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు. కేవలం రెండు వారాల్లోనే ఆమె తిరిగి కోలుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా ఆరు వారాలు పరీక్షలు జరిపగా.. ప్రతిసారి నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. దీంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. కరోనా సోకినా సోఫీ ఎక్కడా ఆందోళ చెందలేదని, అందుకే త్వరగా కోలుకోగలిగారని వైద్యులు చెబుతున్నారు. ఆమె నిజంగా ఫైటర్ అంటూ ప్రశంసలు కురిపించారు. శతాధిక వృద్ధురాలు కరోనాను జయించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Updated : 19 May 2020 10:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top