వయసు 103.. డ్రైవింగ్‌లో కేక పుట్టిస్తున్న తాత..   - MicTv.in - Telugu News
mictv telugu

వయసు 103.. డ్రైవింగ్‌లో కేక పుట్టిస్తున్న తాత..  

February 21, 2018

వందేళ్లు దాటిన వారు ఎలా ఉంటారు? రామా.. కృష్ణా అనుకుంటూ ఓ మూలన ఉంటారు. అయితే 103 ఏళ్ల మైకేల్ డిసౌజా మాత్రం కేక పుట్టిస్తున్నాడు. ఈ పండు ముదిమిలోనూ నానా రకాల కార్లను రోడ్లపై రయ్ రయ్ అంటూ నడుపుతున్నాడు. ట్రాఫిక్‌ను ఛేదించుకుంటూ దూసుకుపోతున్నాడు. దేశంలో అత్యంతవృద్ధ డ్రైవర్‌గా రికార్డుకెక్కిన మైకేల్ 85 ఏళ్లనుంచీ స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నాడు.విలీస్, మోరిస్, మైనర్, ఫియట్, ఆస్టిన్, ఫెర్గూసన్, బెంచ్, షెవర్లెట్, ఫోక్స్ వ్యాగన్ మరెన్నో కార్లు అతని చేతుల్లో గుర్రాల్లా పరుగులు పెట్టాయి. మైకేల్ 1914లో పుట్టాడు. 18 ఏళ్లకు బండి పట్టాడు.1932లో బ్రిటిష్ ఆర్మీలో చేరిన మైకేల్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే విశాఖపట్నానికి వెళ్తున్నప్పుడు తన ఐడీ, ఇతర పత్రాలు పోగొట్టుకోవడంతో ఉద్యోగం పోయింది. తర్వాత పీడబ్ల్యూడీలో ఉద్యోగం వచ్చింది. లారీ, కారు, ట్రాక్టర్లు నడిపాడు. 1982లో రిటైర్ అయి ప్రస్తుతం మైసూరులో ఉంటున్నాడు.

‘నా డ్రైవింగ్ అంటే పిచ్చి. ఎప్పుడూ విసుగురాలేదు. దేవుడు నా కోసం బండి పంపేంతవరకు బండిని నడుపుతూనే ఉంటా’ అని అంటున్నాడు మైకేల్. అందుకు తగ్గట్టుగా అతడు క్రమం తప్పకుండా తన డ్రైవింగ్ సత్తా నిరూపించుకుంటూ లైసెన్సును రెన్యువల్ చేయించుకున్నాడు.

దిన్యూస్ మినిట్ సౌజన్యంతో