మొబైల్ ఫోన్ జీవితంలో ఒక భాగమన్న వాస్తవాన్ని కాదనలేం. కానీ అదే జీవితం కాదు. కాసేపు మాట్లాడుకోవాలి, కాసేపు వీడియోలు చూసుకోవాలి, మెసేజీలు పెట్టుకోవాలి. బస్. అంతే తప్ప దానికి బానిసలం కాకూడదు. అడిక్ట్ అయితే మటుకు చాలా ఘోరాలే జరుగుతాయి. కంటిచూపు, ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, మన టైం బాలేకపోతే ప్రాణాలే పోతాయి. ముఖ్యంగా డ్రైవింగ్, ఇతర సెన్సిటివ్ పనుల్లో ఉన్నప్పుడు ఫోన్ నోరు నొక్కేయడం తప్పనిసరి. లేకపోతే వాహనాలు మనల్ని నొక్కేస్తాయి. 2021 సంవత్సరంలో మన దేశంలో సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ చనిపోయిన వారి వివరాలు తెలిస్తే దిగ్భ్రాంతి కలుగుతులుంది.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021లో ఇలా 1,040 మంది చనిపోయారు. రెడ్లైట్ సిగ్నల్ దాటి వెళ్లడంతో 555 ప్రమాదాలు జరిగి, 222 మంది బలయ్యారు. రహదారుల్లో గుంతల వల్ల జరిగిన 3,625 ప్రమాదాల్లో 1,481 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం జరిగిన మొత్తం 4,12,432 ప్రమాదాల్లో 1,53,972 మంది మృతిచెందగా 3,84,448 మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి :
మొట్టమొదటి ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ క్లినిక్ !
నోట్ల రద్దు చట్ట వ్యతిరేక నిర్ణయం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి