105 ఏళ్ల బామ్మకు కంగ్రాట్స్ చెప్పండి.. 4వ తరగతి పాసైంది..  - MicTv.in - Telugu News
mictv telugu

105 ఏళ్ల బామ్మకు కంగ్రాట్స్ చెప్పండి.. 4వ తరగతి పాసైంది.. 

February 5, 2020

చదువుకు వయసుతో పనిలేదని ఇప్పటికే చాలామంది నిరూపించారు. మంచానికే పరిమితమైన బామ్మలు సైతం కంప్యూటర్లతో, సోషల్ మీడియాతో కుస్తీలు పడుతున్నారు. వారికంటే 105 ఆకులు ఎక్కువ చదివిన 105 ఏళ్ల కేరళ బామ్మ భగీరథి మళ్లీ వార్తల్లోకి ఎక్కేశారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 4వ తరగతి పరీక్షల్లో పాసయ్యా. దేశంలోనే అత్యధిక వయసున్న విద్యార్థిగా రికార్డుకెక్కిన ఈ బామ్మపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాను పదో తరగతి పరీక్షలు కూడా రాసి పాస్ అవుతానని ఆమె ధీమాగా చెబుతున్నారు. 

చిన్నతనంలోనే చదువుకు దూరమైన భగీరథి కొల్లాంలో రాష్ట్ర సాక్షరతా మిషన్‌ నిర్వహించిన పరీక్షలు రాశారు. వాటి ఫలితాలలను బుధవారం  ప్రకటించారు. భగీరథికి 74.5 శాతం మార్కులు వచ్చాయి. అధికారులు, చుట్టుపక్కల జనం ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. భగీరథి చిన్నప్పుడు తల్లిని కోల్పోవడంతో మూడో తరగతితో చదువు ఆపేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత పెళ్లి, పిల్లలు, మనవళ్లతో తీరిక లేకుండా పోయింది. చివరికి తనతో ఎవరికీ అవసరం లేని రోజులు వచ్చాక ఆమె మళ్లీ పలకాబలం పట్టింది.