105-year-old grandmother wins running race in vadodara
mictv telugu

రన్నింగ్ రేసులో 105 ఏళ్ల బామ్మ గెలుపు.. ట్విస్ట్ అదిరిపోయింది

June 21, 2022

105-year-old grandmother wins running race in vadodara

వడోదర వేదికగా జరిగిన 100, 200 మీటర్ల రన్నింగ్ రేసులో 105 ఏళ్ల బామ్మ రామ్ బాయి విజయం సాధించింది. వంద మీటర్లను 45.40 సెకన్లు, 200 మీటర్ల రేసును ఒక నిమిషం 52.17 సెకెన్లలో పూర్తి చేసింది. విజయం సాధించిన తర్వాత ఆమెను ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పోటీ జరుగుతుండగా, ఆమె మనుమరాలు, అథ్లెట్ అయిన షర్మిలా కూడా అక్కడే ఉన్నారు.

విజయంపై షర్మిల మాట్లాడుతూ..‘రోజూ మా బామ్మ తెల్లవారు జామున లేచి మూడు, నాలుగు కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఈ గెలుపుతో ఆమె మరింత బలంగా తయారవుతుంది’ అని హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఉంది. కేవలం వందేళ్లు పైబడిన మహిళలు మాత్రమే టోర్నీలో పాల్గొనాలని నిర్వాహకులు ప్రకటించగా, రామ్ బాయి తప్ప పోటీలో పాల్గొనడానికి ఎవ్వరూ రాలేదు. సో, ఆమె ఒక్కతే పోటీకి వచ్చి, ఎలాంటి పోటీ లేకుండా కప్పు గెలుచుకుంది. కప్పుతో పాటు స్వర్ణ పతకం కూడా సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.