బామ్మ రికార్డ్.. 105 ఏళ్ల వయసులో 4వ తరగతి పరీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

బామ్మ రికార్డ్.. 105 ఏళ్ల వయసులో 4వ తరగతి పరీక్ష

November 20, 2019

-old woman

చదువుకు వయసుతో సంబంధం లేదు. జీవితం చివరి క్షణం వరకు మనిషి తెలుసుకోవాల్సిన విషయాల్లో ఎన్నో ఉంటాయి. పేదరికం, కట్టుబాట్లు, ఇతర కారణాల వల్ల బాల్యంలో చదువుకు దూరమైన వాళ్లు తర్వాత చదువులో రాణిస్తున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. కేరళకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ కూడా ఆ కోవలోకే వస్తారు. ముదిమి మీద పడినా అక్షరాలపై ఆమెకు అనంత ప్రేమ. 

-old woman

వణుకుతున్న చేతులతో పుస్తకాలు చదువుతున్న భగీరథి ఇటీవల నాలుగో తరగతి పరీక్షలు రాసింది. రాష్ట్ర అక్షరాస్యతా మిషన్ నిర్వహించిన ఈ పరీక్షల్లో ఆమె ఇతర వయోజనులతో కలసి ఉత్సాహంగా ప్రశ్నాలకు సమాధానాలు రాశారు. మూడు రోజల్లో పరిసరాల విజ్ఞానం, మలయాళం, గణితం సబ్జెక్టులపై పరీక్షలు రాశారు.  వయసు మీద పడినా భగీరథికి జ్ఞాపకశక్తి ఏమాత్రం తగ్గలేదని కటుంబ సభ్యులు తెలిపారు. ఆమె నాలుగో తరగతి పరీక్షలు రాసిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను పిలిపించుకుని సత్కరించారు. సాక్షరాత మిషన్‌లో చదువుకుంటున్నవారిలో వయసులో ఆమెనే పెద్ద. కొల్లం పట్టణానికి చెందిన భగీరథి తల్లి బాల్యంలోనే చనిపోయింది. దీంతో ఆమె మూడో తరగతిలోనే చదువు ఆపేసి తమ్ముళ్లను, చెల్లెళ్లను పంచడానికి చదువును త్యాగం చేశారు. ఆమెకు ఆరుగుగు సంతానం. వారిలో ఒకరు చనిపోగా, పదుల సంఖ్యలో మనవళ్లు, ముని మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.