కరోనాను జయించిన మరో వందేళ్ల బామ్మ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాను జయించిన మరో వందేళ్ల బామ్మ

September 20, 2020

bamma

మనం జీవితంలో ఏది సాధించాలన్న ఎంతో మనో ధైర్యం అవసరం. ఎందరో యువకులు కరోనా సోకి మరణిస్తున్న ఈ కాలంలో వందేళ్లు దాటిన బామ్మలు మనో ధైర్యంతో కరోనాను జయిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని కొప్పల్‌కు చెందిన 105 ఏళ్ల బామ్మ కరోనా నుంచి కోలుకుంది. తాజాగా మహారాష్ట్రలోని థానేకు చెందిన 106 ఏండ్ల ఆనందీబాయి పాటిల్‌ కరోనాను జయించింది. 

కరోనా బారిన పడిన ఆమె థానేలోని సవ్లారామ్ కల్యాణ్-డొంబివ్లి మునిసిపల్ కార్పొరేషన్(కేడీఎంసీ) కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో ఆదివారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రాహుల్ ఘులే ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోను పోస్టు చేశాడు. ఆ ఫొటోలో బామ్మా ముసిముసినవ్వులు నవ్వుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.