108 మెగాపిక్సెల్ ఫోన్.. ప్రపంచంలోనే తొలిసారిగా..  - MicTv.in - Telugu News
mictv telugu

108 మెగాపిక్సెల్ ఫోన్.. ప్రపంచంలోనే తొలిసారిగా.. 

October 29, 2019

మొబైల్ ఫోన్ టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫోన్ల రంగంలో దూసుకెళ్తున్న చైనా కంపెనీ షావోమీ మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. దీని చిత్రాలను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటితో కెమెరా ఫోన్ ప్రపంచంలో కొత్త శకం మొదలవుతుందని పేర్కొంది. 

ఈ భారీ కెమెరా ఫోన్లను ఎంఐ నోట్‌ 10,  ఎంఐ నోట్‌ 10  ప్రో (ఎంఐ సీసీ9 ప్రో) పేరుతో  లాంచ్ చేయనుంది. ఫీచర్ల వివరాలు బయట పెట్టని కంపెనీ ప్రాసెసర్లను కూడా భారీగా సామర్థ్యంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఎంఐ సీసీ9 ప్రో వచ్చే నెల 5న చైనాలో విడుదల కానుంది. ఈ ఫోన్లు రకరకాల ప్రాసెసర్‌లతో, చక్కని ఫీచర్లతో ఆకట్టుకుంటాయని ఫోన్ల సాంకేతిక నిపుణుడు ముకుల్‌ శర్మ తెలిపారు. ప్రస్తుతానికి అందుతున్న వివరాల ప్రకారం.. ఎంఐ సీసీ 9 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 730జీప్రాసెసర్‌, ఎంఐ నోట్ 10లో ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855‍ సాక్‌ ప్రాససర్‌ ఉన్నట్లు సమాచారం.