తెలంగాణలో కొత్తగా 108 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 108 కరోనా కేసులు

May 27, 2020

108new.

తెలంగాణలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 108 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1803కి చేరింది. మరో 19 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వలస కూలీల సంఖ్య 173కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1321కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 63 మంది ప్రాణాలు కోల్పోగా.. 714 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.