కృష్ణ స్వీట్ మెమొరీస్
కలర్ సినిమా
తొలి అడుగులోనే సాహసం చేశారు. అగ్రహీరోల చిత్రాలే రాణిస్తోన్న సమయంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్తవారితో ఓ సినిమా చేయాలనుకున్నారు. అదీ కలర్ ప్రింట్‌లో. సినీ పెద్దలు వీరివల్ల కాదు అన్నారు. కృష్ణ ఇవేవి పట్టించుకోలేదు. తేనెమనసులు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కలర్‌లో చిత్రీకరించిన తొలి సోషల్ ఫిల్మ్ ఇది.
నిర్మాతల హీరో
ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ని ఆదుకున్నారు.మరెంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చారు.సినిమా ఆడకపోతే ఆ నిర్మాతకు మరో సినిమా ఫ్రీగా చేసి పెట్టేవారు. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను కష్టాల నుంచి గట్టెక్కించారు. అందుకే కృష్ణతో సినిమాలంటే నిర్మాతల క్యూ కట్టేవారు. ఆయన డేట్ కోసం ఎన్నోరోజులు వేచి చూసేవారు.
ఆ రిస్కీ షాట్‌తో జెమ్స్ బాండ్
కృష్ణ చేసిన ఓ రిస్కీ షాట్ నచ్చి నిర్మాత డూండీ గూఢచారి116 సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇది కృష్ణకు మూడో సినిమా.దీంతోనే ఆంధ్రా జెమ్స్ బాండ్‌గా మారారు. తెలుగులో వచ్చిన తొలి స్పై సినిమా. ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకుంది.
మూడు షిప్టులు…బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
సినిమా ఒప్పుకున్నారు అంటే కృష్ణ తన సినిమాగా ఫీలయ్యేవారు.మూడు షిప్టులు పనిచేసేవారు. రాత్రి మూడు గంటలదాకా పనిచేసి పొద్దున్నే ఉదయం ఏడుగంటలకు ఆఫీసుకొచ్చేవాళ్లు. కొత్తదనం కోసం ఎక్కువ కష్టపడేవారు. తాను సంపాదించిందంతా సినిమాలకే ఖర్చు చేశారు.
మెమరీ పవర్
అద్బుతమైన డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. సింగిల్ టేక్‌లో ఎంతపెద్ద డైలాగ్ అయినా చెప్పేవారు. మంచి మనస్సుతో సినీరాజై వెలిగారు. వెండితెరపై ట్రిగ్గర్ పేల్చే శక్తి సూపర్ స్టార్ దే. ఆరోజుల్లో ఆయనో డైనమెట్. నిర్మాతలు, డైరెక్టర్లకు ఏకే 47, లా తయారయ్యారు. వెంటవెంటనే సినిమాలు తీసి థియేటర్లకు వదిలేవారు.
సింహాసనం..తొలి 70 ఎంఎం సినిమా
నటశేఖర కృష్ణ అరుదైన ఫిల్మ్ మేకర్.డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. సింహాసనంతో తొలి 70ఎంఎం సినిమాను తీశారు. బాలీవుడ్ సంగీతదర్శకుడు బప్పీలహరి, నటి మందాకిని, నటుడు ఆజాంద్ ఖాన్‌లను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఒకే సమయంలో తెలుగు, హిందీ సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఫిల్మ్ మేకర్.
ఆంధ్రా కౌబాయ్
హాలీవుడ్ చిత్రాలు గుడ్ బ్యాడ్ అండ్ ఆగ్లీ,మెకానస్ గోల్డ్ చిత్రాల ప్రేరణతో తెలుగులో కౌబాయ్ చిత్రాలు చేశారు. ఇది సాధ్యం కాదని ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు అప్పట్లో చెప్పారు. కానీ కౌబాయ్ చిత్రాల్ని తీసి కృష్ణ ప్రేక్షకుల్ని మెప్పించారు. గుర్రపు స్వారీల్ని తెరపై అద్భుతంగా చూపించారు.
ఎన్నో ప్రయోగాలు
కృష్ణ అంటే ప్రయోగాలు..ప్రయోగాలు అంటే కృష్ణ. తెలుగుతెరకు సాంకేతికతను పరిచయం చేసిన తొలి నటుడు.విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అల్లూరి కథకు ఎన్టీఆర్ సన్నద్ధమైనా చివరకు కృష్ణనే చేశారు. తెలుగుజాతి గర్వించేలా ఈ సినిమాతో మెప్పించారు.సినిమా స్కోప్ విధానంలో ఈ సినిమాని పూర్తి చేశారు.
సాహసవీరుడు
తెరపై సాహసాలు చేయడంలో కృష్ణను మించినోళ్లులేరు. రైతులు, పౌరాణిక పాత్రల్లోనూ తనమార్క్ చూపించారు. దేవదాసు, కురుక్షేత్రం, పాడి పంటలు, పండంటి కాపురం చిత్రాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి చిత్రాలతో తిరుగులేని నటుడిగా ఎదిగారు.