10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై 6 పేపర్లతోనే - MicTv.in - Telugu News
mictv telugu

10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై 6 పేపర్లతోనే

November 3, 2022

10th Class Exams Conducted with Six papers in Telangana

పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2022 23) కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. సెకండ్ లాంగ్వేజ్ హిందీ మినహా మిగతా సబ్జెక్టులన్నింటికి 2 పేపర్ల చొప్పున విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల వల్ల గతేడాది (2022) పూర్తి స్థాయిలో సిలబస్ పూర్తికాకపోవడంతో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా పదో తరగతి పరీక్షలపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం… ఈ ఏడాది నుంచి 6 పేపర్లకే పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

11 పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులపై భారం పడుతోందని.. 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి.. ఎస్​సీఈఆర్టీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించింది. అయితే సైన్స్ సబ్జెక్ట్ లో ఫిజిక్స్, బయోలజీలకి వేర్వేరు ఆన్సర్ షీట్స్ ఉంటాయని తెలిపింది.