తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 1107కి చేరింది. ప్రస్తుతం 430 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి.
ఈరోజు ఒక్కరోజే 20 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 648 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశంలో కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 49,391 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 14183 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 1694 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.