11 people attempted to rape AP Sarpanch
mictv telugu

ఏపీలో దారుణం..సర్పంచ్‌పై 11 మంది అత్యాచారయత్నం

August 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో దారుణం జరిగింది. 11 మంది కామాంధులు కలిసి మహిళా సర్పంచ్‌పై అత్యాచారానికి ప్రయత్నించారు. దాంతో ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయగా..హత్య చేసేందుకు యత్నించారు. అంతేకాదు, పొత్తి కడుపు, మెడ, ఇతర అవయవాలపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు.

విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామలాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో జరిగింది. బాధితురాలు సర్పంచ్. తనపై 11 మంది అత్యాచారానికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులో ”నేను రేకుల షెడ్డులో ఉన్నప్పుడు పి.శ్రీనివాసరావు, పి. జగదీశ్, పి. భద్రరావు, పి. సుధాకర్, పి. రమణబాబు, ఎల్. సురేశ్ కుమార్, ఎ.శ్రీనివాసరావు, ఇ.సోమశేఖర్, ఎల్. వెంకటరాజు, పి. ప్రసాద్, పి. మధు అనే వ్యక్తులు వచ్చి లైంగిక దాడికి ప్రయత్నించారు. నేను ప్రతిఘటించే ప్రయత్నం చేశాను. దాంతో వారు నన్ను హత్య చేసేందుకు యత్నించారు. పొత్తి కడుపు, మెడ, ఇతర అవయవాలపై దాడి చేసి, చిత్ర హింసలకు గురి చేశారు. నేను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. దాంతో వారంతా పారిపోయారు” అని ఆమె పేర్కొన్నారు అని తెలిపింది.

అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్యామలాదేవి, మీడియాతో మాట్లాడుతూ..”నిందితులు ఎవరు అయినా సరే చట్టం ప్రకారం శిక్ష విధిస్తాం. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాం. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం” అని ఆమె అన్నారు.