తెలంగాణలో రికార్డ్.. ఒక్కరోజే 117 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో రికార్డ్.. ఒక్కరోజే 117 కేసులు

May 28, 2020

kjuy

తెలంగాణ రాష్ట్రంలో నేడు కరోనా పాజిటివ్ కేసులు రికార్డు నెలకొల్పాయి. రికార్డు స్థాయిలో ఈరోజు 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,216కి చేరింది. వారిలో 66 మంది కరోనా బారిన పడగా, ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో 49 మందికి కరోనా బారినపడ్డారు. 

ఈరోజు కరోనాతో నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 844 ఉన్నాయి. 1,345 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1908 కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ వెల్లడించింది. కాగా, నేడు జిల్లాల నుంచి కేసులు నమోదు కాలేదని తెలిపింది.