ఆహారం తీసుకోవడానికి మనవాళ్ళు ఒక సూత్రం పెట్టారు. బ్రేక్ ఫాస్ట్ రాజులా తినాలి. లంచ్ మామూలుగా తినాలి. డిన్నర్ పేదవాడి తిండిలా ఉండాలి లేదా అస్సలు తినకపోయినా పర్వాలేదు అని. అంటే అన్నింటికంటే బ్రేక్ ఫిస్ట్ చాలా మంచిది, అదే ఎక్కువ తినాలి అని చెప్పడం దీని ఉద్దేశ్యం. పూర్వం రాజులు శక్తి కోసం చాలా ఎక్కువ తినేవారుట. అందుకే మన బ్రేక్ ఫాస్ట్ కూడా రాజుల భోజనంలా ఉండాలి అని చెప్పేది. మనం ఉదయం లేవగానే తినే ఫస్ట్ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్. అది తిన్న తర్వాతనే మన పనులు మొదలవుతాయి. అంటే మనం తిన్న ఆహారం అరగడానికి చాలా టైమ్ ఉంటుంది. పైగా మనం పనులు చేస్తాం కాబట్టి ఈజీగా అరుగుతుంది కూడా. అందుకే దాన్ని ఎంతైనా తినండి చెబుతున్నారు. రాత్రి తిన్న తర్వాత పడుకోవడం తప్ప ఏ పనీ చేయము కాబట్టి అప్పుడు తినకపోయినా పర్వాలేదు. లేదా చాలా తక్కవు తినండని చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్ మంచిగా తినమన్నారు కదాని ఏది పడితే అది, ఏంత పడితే అంత తినేయడం కాదు.అందులో కూడా ఎలాంటివి తినాలి అని తెలుసుకోవాలని అంటున్నారు నిపుణులు. మన బ్రేక్ ఫాస్ట్‌లో ఫైబర్, ప్రొటీన్, కొవ్వులు, కార్బస్ సమంగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే మొలకలు, ఉడికించిన కూరగాయల ముక్కలు, తాజా పండ్లు, ఉడికించిన గుడ్డు తెల్లసొన ఉండేలా అల్పాహారాన్ని ఎంచుకుంటే కడుపునిండిన భావన కలుగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, నీరసం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, కొన్ని ఆహారాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.
బ్రేక్ ఫాస్ట్ లో తినకూడని పదార్ధాలు కొన్ని ఉన్నాయి, మన ఇండియన్స్ ఎక్కువగా తినేవి ఇవి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ:
పూరీ చాలా మంది ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. ఇది నూనెలో ఫ్రై చేస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉండవు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా తింటే.. శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని కారణంగా.. అధిక బరువు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వడ లేదా గారెలు:
సౌత్ ఇండియాలో సాధారణంగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్. ఇది కూడా డీప్ ఫ్రైడ్ ఫుడ్. దీనిని తయారు చేయడానికి మినపపప్పు వాడతారు.. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.
కార్న్ ఫ్లేక్స్:
కార్న్ ఫ్లేక్స్ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిలో పంచదార, ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కార్న్ ఫ్లేక్స్‌లో ఫైబర్ కూడా ఉండదు. అందువల్ల.. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆఫ్షన్ కాదు.
వైట్ బ్రెడ్:
చాలా మంది పిల్లలు.. బ్రెడ్, జామ్ తినడానికి ఇష్టపడతారు. కానీ, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కాదు. దీనిలో చక్కెర, కార్బస్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధికబరువు, డయాబెటిస్ బారినపడే ప్రమాదం ఉంది.
దీన్ని బట్టి నూనెలో వేయించిన పదార్ధాలు ఏమైనా తినకుండా ఉండడమే మంచిది. ఎప్పుడైనా నెలకి ఒకసారి తినొచ్చు కానీ రోజూ తినకూడదు. మన జిహ్వని చంపేసుకుని ఏ పనీ చేయకూడదు. అలా చేస్తే దానివల్ల మరింత మనకి తిండి మీద యావ పెరుగుతుందే తప్ప ప్రయోజం ఏమీ ఉండదు.
పైన చెప్పినవి తినకూడదు సరే కానీ మరి ఏమి తినాలి అని డౌట్ వస్తుంది కదా. పైగా శుభ్రంగా తినాలి అని చెబుతున్నారు అని కూడా. మనకు హెల్త్ కి మంచివి, కడుపు నిండే బ్రేక్ ఫాస్ట్ లు చాలానే ఉన్నాయి అలాంటివి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపు నిండుతుంది.
పప్పులతో ఉన్న పదార్ధాలు:
పప్పులు మనకు ప్రొటీన్ ఇస్తాయి అని మనకు తెలిసిందే. దీంతో చేసే ఫ్రైడ్ కాని ఐటమ్స్ ఏమైనా తినొచ్చు. అంటే పప్పుడ స్టఫ్ చేసే పరాటాలు, చపాతీలు లేదా కిచిడీ లాంటివి తినొచ్చు. మళ్ళీ కిచిడీ కూడా అన్నం కాకుండా గోధుమరవ్వ, ఓట్స్ లాంటి వాటితో చేసుకుంటే చాలా మంచిది.
ఇడ్లీ లేదా ఓట్స్ ఇడ్లీ:
ఇడ్లీ ఎప్పుడూ మంచిదే. ఏ టైమ్ లో తిన్నా కూడా ఇది మన హెల్త్ కి హెల్స్ చేస్తుంది. డాక్టర్లు కూడా ఏదైనా తినాలి అంటే ఇడ్లీనే సజెస్ట్ చేస్తారు. దీన్ని ఓట్స్ తో చేసుకుని తింటే మరీ మంచింది. దీంట్లో క్యారెట్ లాంటి కూరలను కూడా కలుపుని తింటే అన్ని పదార్ధాలు మనం తిన్నట్టు అవుతుంది.
పోహా:
అటుకులుతో చేసే ఉప్మాని పోహా అంటారు. ఇది కూడా బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచింది. పోహాలో ఉండే సుగుణం ఏంటంటే దీన్ని కొంచెం తీసుకుంటే చాలు మన కడుపు నిండిపోతుంది. కాబట్టి అటుకులు రైస్ కు సంబంధించినదే అయినప్పటికీ తక్కువ తీసుకుంటాము కాబట్టి పర్వాలేదు.
దోశలు:
ఇవి కూడా బ్రేక్ ఫాస్ట్ కి మంచి ఛాయిస్. కానీ పది, పన్నెండు కాకుడా లిమిటెడ్ గా తినాలి. రెండు, మూడు దోశలు, తక్కువ ఆయిల్ తో తింటే పర్వాలేదు.
స్ప్రౌట్స్ సలాడ్:
మొలకెత్తిన గింజలు ఏవైనా బ్రేక్ ఫాస్ట్ కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, కార్బ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది పెరఫెక్ట్ మీల్ అవుతుంది. దీంట్లో కూరలు, నట్స్ లాంటివి కూడా కలిసి తింటే ఇంకా మంచిది.
చియా సీడ్స్:
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో చియా సీడ్స్ ఉండే లా చూసుకుంటే ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. చియా సీడ్స్ వెయిట్ లాస్ కు హెల్స్ చేయడమే కాకుండా మనకు ఇమ్యూనిటీ బూస్టర్స్ గా కూడా పని చేస్తాయి. వీటిని ఓట్స్ లాంటి వాటితో ఓవర్ నైట్ నానబెట్టుకుని పుడ్డింగ్ లా చేసుకుని తింటే రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యం కూడా. ఇంుదలో కావాలంటే నచ్చిన పళ్ళు కూడా కలుపుకోవచ్చును.
తాజాపళ్ళు:
పండ్లు ఎప్పుడు తిన్నా మంచిది. ఉదయాన్నే తింటే మంచిది. బనానా లాంటి ఫ్యాటీ ఫ్రూట్స్ కూడా ఉదయాన్నే తింటే ఎటువంటి నష్టమూ ఉండదు. మనం పని చేసినప్పుడు అరిగిపోతాయి కాబట్టి వాటి వల్ల వచ్చే కొవ్వు మంచి కొవ్వు కింద మారిపోతుంది.
ఇవి కూడా చదవండి :