12 hijab-clad students denied entry to University College in Mangaluru
mictv telugu

హిజాబ్‌పై మళ్లీ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు..

May 30, 2022

12 hijab-clad students denied entry to University College in Mangaluru

కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముస్లిం విద్యార్థినులు కొందరు శనివారం హిజాబ్ ధరించి మంగళూరు యూనివర్సిటీ కాలేజీకి రాగా.. వారిని కాలేజీ అధికారులు అనుమతించలేదు. సోమవారం కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో… దీనిపై డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ను ఆశ్రయించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఆ సలహాతో ముగ్గురు విద్యార్థినులు.. హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌(డీసీ) రాజేంద్రను కోరారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించేందుకు మార్గం సుగమం చేయాలంటూ అభ్యర్థన చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన ఆయన.. కాలేజీ యూనిఫాంకు కట్టుబడి ఉండాలని విద్యార్థినులకు సూచించానని మీడియాకు తెలిపారు. విద్యా ప్రాంగణాల్లో హిజాబ్ లేదా కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల శాంతికి విఘాతం కలిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయొద్దని విద్యార్థినులకు సూచించానని చెప్పారు. చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కాలేజీ క్యాంపస్‌లో శాంతి, సామరస్యాల గురించి ఆలోచించాలని విద్యార్థినులకు సూచించానన్నారు.