గౌహతిలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గౌహతిలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

May 16, 2019

అస్సాంలోని గౌహతి నగరంలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. జూ రోడ్‌లోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో ఓ గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గాయపడిన పన్నెండు గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. యూఎల్ఎఫ్ఏ-1 కమాండర్ పరేష్ బారుహ ఈ పేలుడు తమదేనని ధ్రువీకరించాడు. సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ టార్గెట్‌గా ఈ దాడి జరిపినట్టు ఓ ప్రకటనలో తెలిపాడు.