షాక్.. భద్రాద్రిలో 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్లకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

షాక్.. భద్రాద్రిలో 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్లకు కరోనా

July 4, 2020

Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. చాటకొండలోని టీఎస్ఎస్పీ ఆరవ బెటాలియన్‌కు చెందిన 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. ఈ మేరకు జిల్లా వైద్య అధికారి శనివారం ప్రకటించారు. టీఎస్ఎస్పీ ఆరవ బెటాలియన్‌కు చెందిన 12 మంది ఐఆర్ కానిస్టేబుళ్లు ఇటీవలే.. హైదరాబాద్ వెళ్లారని తెలిపారు. అక్కడి అంబర్ పేట, జుమ్మేరాత్ బజార్‌లో ఏర్పాటు చేసిన బందోబస్తుకు హాజరయ్యారని వెల్లడించారు. అక్కడే వారికి కరోనా సోకిందని అనుమానాలు వ్యక్తంచేశారు. 

ఈ క్రమంలో స్థానిక తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీవో రామారావు, ఆరోగ్య సిబ్బంది ఆరవ బెటాలియన్ క్యాంపును సందర్శించారు. కరోనా సోకిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. బెటాలియన్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయాలని సూచించారు. కాగా, భద్రాద్రిలో పాజిటివ్ కేసుల సంఖ్య 54కు పెరిగింది.