12 members of Rajkot BJP MP's family killed in Morbi bridge collapse
mictv telugu

గుజరాత్ దుర్ఘటన.. ఎంపీ కుటుంబంలోని 12 మంది మృతి

October 31, 2022

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటన.. అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు పిల్లలతో సహా తన కుటుంబంలోని 12 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఆయన మీడియాతో చెప్పారు.

ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వంతెన అనుమతుల గురించి వస్తోన్న వార్తలపైనా ఎంపీ స్పందించారు. ‘‘ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తాం. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు’’ అని విచారం వ్యక్తం చేశారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. ప్రమాదంలో బయటపడిన వారందరినీ రక్షించారు. మచ్చు నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా ఉపయోగిస్తున్నారు. గుజరాత్‌లోని మోర్బీ సిటీలోని మచ్చు నదిపై శతాబ్దాల నాటి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటికి 141 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.