గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్

July 7, 2020

LG Polymers

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు. ఈ  ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అధికారులు తేల్చారు. నిందితులపై 304(2), 338, 285, 337, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదిలావుండగా ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తన పూర్తి నివేదికను నిన్ననే ముఖ్యమంత్రి జగన్‌కు సమర్పించింది. మరోవైపు నీరబ్ కుమార్ కమిటీ సైతం యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి దారి తీసిందని తెలిపింది. కాగా, ఎల్జీ పారలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరెన్ విషవాయువు లీకై 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరెందరో గాయపడ్డారు.