12 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. లవర్ మరొకర్ని ప్రేమిస్తున్నాడని.. - MicTv.in - Telugu News
mictv telugu

12 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. లవర్ మరొకర్ని ప్రేమిస్తున్నాడని..

September 11, 2020

12 year old girl incident in faridabad.

ప్రేమలో విఫలం అయ్యాననే బాధతో 12 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ పట్టణంలో జరిగింది. బల్లభ్ గడ్ ప్రాంతంలో తల్లిదండ్రులతో ఉంటున్న ఆ బాలిక గదిలో దొరికిన సూసైడ్ నోట్ ప్రకారం.. ఆ బాలిక తమ పొరుగున నివసిస్తున్న మైనర్ బాలుడితో ప్రేమలో పడింది. అయితే ఆ బాలుడు వేరే అమ్మాయి ప్రేమిస్తున్నాడని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. 

తనను ప్రేమించమని కోరినప్పటికీ, అతడు అంగీకరించలేదని, దీంతో బతుకుపై ఆశల్లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. తన చావుకి దేవుడే కారణమని ఆ బాలిక సూసైడ్ నోట్ లో పేర్కొంది.బాలిక ఆత్మహత్య గురించి ఆమె తండ్రి స్పందిస్తూ.. తమ కూతురు గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటోంది. ఆమె ఆరోగ్యం బాలేదనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాం. డాక్టర్ కూడా ఏమి లేదని చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లివచ్చిన రాత్రి తమ కూతరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు.. ఎసిపి ఆదర్శ్‌ దీప్ తెలిపారు.