కష్టార్జితంతో 12 ఏళ్లకే బీఎండబ్ల్యూ కారు... - MicTv.in - Telugu News
mictv telugu

కష్టార్జితంతో 12 ఏళ్లకే బీఎండబ్ల్యూ కారు…

April 17, 2019

నమ్మశక్యంగా లేకున్నా అక్షరమక్షరం నిజం.. తండ్రిదండ్రులు ఇచ్చిన డబ్బు కాదు, ఎవరో వారసులేక చనిపోతూ రాసిన సంపద కాదు, లాటరీ సొమ్ము అసలే కాదు, లంకె బిందెల గొడవే కాదు.. పక్కా కష్టార్జితం! నికార్సుగా  చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో..12 ఏళ్ల బాలిక ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనేసింది. థాయ్‌లాండ్‌లో జరిగిందీ సంఘటన.

నాత్తనన్  పేరుకే పిల్లగాని పెద్దలు ఉండాల్సిన అన్ని తెలివి తేటలూ ఉన్నాయి. మూడేళ్ల వయస్సు నుంచే ఆ పిల్లకు మేకప్ అంటే ఇష్టం. చిట్టిచిట్టి చేతులతో తనపైనా, తన ఇంట్లో వాళ్లపైనా ప్రయోగాలు చేసేంది. ఏడేళ్ల వయస్సులో మేకప్ గురించి ప్రొఫెషనల్ కోర్సులు చేసింది. ఇది సోషల్ మీడియా కాలం కనుక అమ్మాయి చూపు అటువైపు మళ్లింది. తను తెలుసుకున్న మేకప్ చిట్కాలను యూట్యూబ్ తోపాటు వివిధ నెట్ వర్కింగ్ సైట్లలో పంచుకుంటోంది. లక్షలాది అభిమానులు పోగయ్యారు. ఇంటికే వచ్చేయసాగారు. దీంతో నాత్తనన్ మేకప్ ఆర్టిస్టుగా మారిపోయింది. డబ్బులు దండిగా వచ్చేస్తున్నాయి. 2018లో లండన్ ఫ్యాషన్ వీక్‌కు ఎంపికై కలకలం రేపింది.

చిన్నమ్మి ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా  ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటో మరింత వైరల్ అయింది. నాత్తనన్  తెలియని వారికి కూడా తెలిసిపోయింది. తను కొన్న బీఎండబ్ల్యూ సెడాన్ కారుతో దిగిన ఫొటో అది. అందరి దీవెనలతో ఈ స్థాయికి ఎదిగానని ఆమె వినయంగా చెప్పింది. ఇంతకూ బీఎండబ్ల్యూ కారు ఎంత ఎంతో తెలుసా? మోడల్‌ను బట్టి రూ. 46 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉన్నాయి.

rr