Home > క్రైమ్ > బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక.. పరిస్థితి విషమం

బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక.. పరిస్థితి విషమం

12-year-old pregnant girl gives birth In Punjab

బడికి వెళ్తానని చెప్పిన బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేశారు. తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే ఏమంటారో అని భయపడి.. తనలోనే దాచుకుంది. చివరి వరకు తను గర్భం దాల్చిందని.. బిడ్డకు జన్మనివ్వబోతున్నాని కూడా తెలియని ఆ పన్నెండేండ్ల చిన్నారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ ఘటన పంజాబ్ లోని ఫగ్వారాలో జరిగింది.

ఫగ్వారాలో ఉంటున్న పన్నెండేళ్ల బాలికపై కొన్ని నెలల క్రితం హత్యాచారం జరిగింది. ఆ ఘటనతో ఆ బాలిక గర్భం దాల్చగా.. ఆ విషయం తనకు తెలియలేదు. నిన్న (మే 28) కడుపునొప్పితో బాధపడుతున్న ఆ బాలికను తండ్రి హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. ఆమె గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆ గర్భవతి ప్రసవించి.. నెలలు నిండని 800 గ్రాములున్న బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ విషయంపై డాక్టర్లు బాలిక తండ్రి ప్రశ్నించగా.. తను ఏడు నెలలుగా కడుపు నొప్పి అంటూ బాధ పడుతుందని, అలా అన్న ప్రతిసారి ట్యాబ్లెట్ ఇచ్చేవాడినని చెప్పాడు. ఇంట్లో తామిద్దరమే ఉంటున్నామని, తన భార్య ఇద్దరినీ విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిపాడు. బాలిక తనపై గతంలో తనపై అత్యాచారం జరిగిందని ఎప్పుడూ చెప్పలేదని వివరించాడు. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలిని ప్రశ్నించగా.. తనపై ఏడు నెలల క్రితం అత్యాచారం జరిగిందని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నిందితుడు బెదిరించినట్లు తెల్పింది. నిందితుడి పేరు తెలియదని, ముఖం చూస్తే గుర్తుపట్టగలనని పోలీసులకు వివరించింది. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడిని త్వరలోనే అరెస్ట్‌ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated : 28 May 2023 8:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top