ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహం శంకుస్థాపన చేయనున్నారు.
అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరియల్ హాలు, మేమోరియల్ లైబ్రరీ, ల్యాండ్ స్కేపింగ్, స్టడీ సెంటర్, గార్డెన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జాయింట్ కలెక్టర్ డా కె మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, జేసీ కె మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 కల్లా ఈ విగ్రహాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోజు అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.