డిసెంబర్ నాటికి 125 అడుగుల‌ అంబేద్కర్‌: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

డిసెంబర్ నాటికి 125 అడుగుల‌ అంబేద్కర్‌: కేటీఆర్

April 13, 2022

 

amb

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 125 అడుగుల‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం నిర్మాణానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్బంగా ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం ట్యాంక్‌బండ్‌ దగ్గర పీవీ మార్గ్‌లో 125 అడుగుల‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహ నిర్మాణ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ”ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి అవుతుంది. ఇక్కడ‌ ప‌ర్యాట‌క రంగాన్ని ఆక‌ర్షించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తాం” అని కేటీఆర్ అన్నారు.

అంతేకాకుండా ‘ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో కూడా బీజేపీనే చెబుతోందట. దళితులపై కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దళిత బంధుకు రూ. 17,700 కోట్లు కేటాయించాం. టాలెంట్‌ ఎవరి అబ్బసొత్తు కాదు. ప్రపంచంలో రెండు కులాలు ఉన్నాయి. డబ్బు ఉన్నవారు, డబ్బు లేని వారు. కానీ, దేవుడి అందర్నీ సామానంగానే పుట్టించాడు. కులం, ఉప కులం, మతం అనేవి మనమే సృష్టించుకున్నాం” అని కేటీఆర్ బీజేపీ నాయకులపై మండిపడ్డారు.