ఏడాది పాటు కొత్త సంక్షేమ పథకాలు ఉండవ్..కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాది పాటు కొత్త సంక్షేమ పథకాలు ఉండవ్..కేంద్రం

June 5, 2020

new schemes.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. లాక్ డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. దేశ ఖజానాకు ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయబోమని స్పష్టం చేసింది. మార్చ్ 2021 తరువాతే కొత్త పథకాల గురించి ఆలోచిస్తామని తెలిపింది. 

ఖర్చు తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని, దానిలో భాగంగానే పథకాలకు బ్రేక్ వేశామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కొత్త పథకాలకు సంబంధించిన అభ్యర్థనలను కేంద్ర ఆర్థికశాఖకు పంపవద్దు అంటూ అన్ని మంత్రిత్వశాఖలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర బడ్జెట్ కింద ఇప్పటికే కొన్ని స్కీమ్‌లకు కేటాయించిన నిధులనూ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీకి మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ నిధులకు ఎక్కువ డిమాండ్ ఉన్నదని, అవసరాలకు తగినట్లు నిధుల మంజూరీ ఉంటుందని ఆర్థికశాఖ పేర్కొన్నది.