తెలంగాణలో నేడు 1,278 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నేడు 1,278 కేసులు

July 10, 2020

1,278 Positive.

తెలంగాణలో నేడు కూడా కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపింది. నేడు ఒక్కరోజే 1,278 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 762 పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల్లో తీసుకుంటే.. రంగారెడ్డిలో 171, మేడ్చల్ 85, సంగారెడ్డి 36, కామారెడ్డి 23, మెదక్ 22, ఖమ్మం 18, మహబూబ్ నగర్ 14, సూర్యాపేట్ 14, నారాయణ పేట్ 9, కరీంనగర్ 9, వరంగల్ రూరల్ 8, నిజామాబాద్ 8, మహబూబా బాద్ 6, పెద్దపల్లి 6, వరంగల్ అర్బన్ 5, సిద్దిపేట్ 4, జనగాం 3, నిర్మల్ 1, యాదాద్రి 1, ఆసిఫాబాద్ 1, వనపర్తి 1, గద్వాల 1గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32,224కు పెరిగింది. ఈరోజు కరోనా చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందగా, ఇప్పటివరకు నమోదైన మృతులు సంఖ్య 339కి పెరిగింది. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఇవాళ 1,013 మంది డిశ్చార్జ్ అవగా.. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 19,205కు చేరింది. కాగా, ప్రస్తుతం 12,680 యాక్టివ్ కేసులు ఉన్నాయి.